SSC Exam Fee : పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే.. ఆ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని సవరిస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2025, SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకునే రెగ్యులర్, ప్రైవేట్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు, నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించవచ్చని పేర్కొంది.
అయితే.. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా.. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30 వరకు పరీక్ష ఫీజు అంగీకరించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు లేదా https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
గతంలో ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుము చెల్లిస్తే.. ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. అయితే ఇకపై ఇలా చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇక నుంచి పదో తరగతి పరీక్షల ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని తెలిపింది. ఆ మేరకు చలానా విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి పరీక్షల ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. మరింత పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది..
Pawan Kalyan: రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి