NTV Telugu Site icon

SSC and Inter Results : తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్‌.. వారంలో ఫలితాలు

Results

Results

తెలంగాణలోని విద్యా్ర్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఒక వారంలో ప్రకటించబడనున్నాయి. రెండు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అధికారులు ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు మే 10న, పదోతరగతి ఫలితాలు మే 12న ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించుకోవడానికి సాంకేతిక పరీక్షలతో పాటు ఫలితాలను మూడుసార్లు వెరిఫై చేస్తున్నారు. విజయవంతమైన ట్రయల్స్ తర్వాత, ఫలితాలు ప్రకటించబడనున్నాయి. మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 5,05,625 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏప్రిల్ 3 నుండి 13 వరకు జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 2,49,747 మంది బాలురు మరియు 2,44,873 మంది బాలికలు సహా 4,94,620 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read : Manipur Clashes : మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానం

Show comments