Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!

Varanasi Mahesh Babu

Varanasi Mahesh Babu

ప్రపంచ సినిమా వేదికపై ఇప్పుడు అందరి కళ్లు దర్శకధీరుడు రాజమౌళి వైపు ఉన్నాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ (SSMB29) బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో, ఈ సినిమా తన మొదటి అంతర్జాతీయ అడుగును మెక్సికోలో వేయబోతోంది.

మెక్సికో సిటీలో జరుగుతున్న CCXP MX 2026 వేదికపై ఏప్రిల్ 24న (రేపు) ‘వారణాసి’ టీమ్ ఒక స్పెషల్ ప్యానెల్‌ను నిర్వహించబోతోంది. థండర్ స్టేజ్ (Thunder Stage) పై జరగబోయే ఈ ఈవెంట్‌లో “వారణాసి టు ద వరల్డ్” (Varanasi to the World) అనే పేరుతో ఒక ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ఈ కార్యక్రమంలో పాల్గొని గ్లోబల్ ఆడియన్స్‌తో ముచ్చటించనున్నారు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, ఈ ఈవెంట్ కోసం ఒక ప్రత్యేకమైన వీడియో మెసేజ్‌ను పంపారు. ఇందులో సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని ఆసక్తికరమైన విషయాలను, తన విజన్‌ను ఆయన పంచుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశాల్లో జరగడం, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించడం వంటి వార్తలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.