Site icon NTV Telugu

RRR New Record: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్

Rrr Releasing In Japan

Rrr Releasing In Japan

RRR New Record: తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ట్రిపుల్ఆర్. ఈ ఏడాది విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డులు, రివార్డులను సాధిస్తూ దూసుకుపోతుంది. విడుదలై 9 నెలలు అవుతున్నా చిత్రం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ. 550 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ చిత్రం సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్-2022 జాబితాలో 50 ఉత్తమ చిత్రాల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

Read Also: Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో ‘కింగ్’ ఒక్కరే

ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలైన టాప్ గన్ మావెరిక్, టార్‌లను వెనక్కి నెట్టి ముందు నిలబడింది. సౌండ్ అండ్ సైట్ మ్యాగజైన్-2022 రూపొందించిన జాబితాలో తెలుగు చిత్రం చోటు దక్కించుకుంది. అదే జాబితాలో చేరిన మరో భారతీయ చిత్రం షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి 32వ స్థానం దక్కింది.  స్కాటిష్ చలనచిత్ర దర్శకుడు షార్లెట్ వెల్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆఫ్టర్ సన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలోని టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్: మావెరిక్, డేవిడ్ క్రోనెన్‌బర్గ్ చిత్రం క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్, కేట్ బ్లాంచెట్ సినిమా టార్, గిల్లెర్మో డెల్ టోరో చిత్రం పినోచియో, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ వంటి అతిపెద్ద హాలీవుడ్ సినిమాలను అధిగమించింది.

Exit mobile version