Site icon NTV Telugu

KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో

Srk

Srk

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌కు మొదటిసారి వెయ్యికోట్ల సక్సెస్‌ ఇచ్చిన సినిమా పఠాన్‌. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్. డంకీ వంటి ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ  డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్ తో చేతులు కలిపి కింగ్‌ సినిమా చేస్తున్నాడు షారుఖ్‌ ఖాన్‌. ఈసారి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాడు.

Also Read : Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

కింగ్ సినిమాలో ఉన్న హైలైట్ ఏంటంటే.. ఈ సినిమాతోనే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే ది ఆర్చీస్ అనే ఓటీటీ మూవీలో మెరిసిన సుహానా, ఇప్పుడు తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనుంది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు.. రీల్ లైఫ్‌లో కూడా ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారు… అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘కింగ్’ సినిమా థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ సీజన్ షారుక్ ఖాన్‌కు ఎప్పుడూ కలిసొచ్చే అంశం. సుమారు రెండేళ్ల నిరీక్షణ తర్వాత రాబోతున్న ఈ సినిమా, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను క్రియేట్‌ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్ అండ్‌ స్టార్ పవర్‌తో వస్తున్న ‘కింగ్’ మరోసారి వేయి కోట్లు కలెక్ట్‌ చేసి మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.

Exit mobile version