Srisailam: ఈ నెల 28వ తేదీన శ్రీశైలం మల్లన్న ఆలయం మూత పడనుంది.. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా.. 28వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు 29వ తేదీన ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు ఆలయ సిబ్బంది.. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.. శ్రీశైలం ప్రధానాలయంతో పాటు.. పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు కూడా మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అయితే, 29వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూర్తి చేసిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.. అంటే ఉదయం 29న ఉదయం 7 గంటల తర్వాత శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇక, చంద్రగ్రహణం సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలతో పాటు.. చిన్న ఆలయాలను కూడా 28వ తేదీన సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.. అయితే, ఈ ఆలయం ఏ సమయంలో మూసివేస్తారు అనేదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Srisailam: 28న శ్రీశైలం ఆలయం మూసివేత..
Show comments