Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల తాకిడి..!

Srisailam

Srisailam

Srisailam: కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్‌ దగ్గర.. గేట్లు ఎత్తినప్పుడు.. ఆ కృష్ణమ్మ పరవళ్లు తొక్కే విధానం అందరినీ కట్టిపడేస్తోంది.. రెగ్యులర్‌గా శ్రీశైలం వెళ్లేవారు సైతం.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తినప్పుడు మరోసారి వెళ్లి వద్దాం అనుకుంటారు.. అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది.. శ్రీశైలం డ్యామ్‌ నుంచి దూకే కృష్ణమ్మ పాలనురగలా.. అందరినీ ఆకట్టుకుంటుంది.. ఇక, డ్యామ్‌ పరిసరాల్లో.. వర్షంలా పడే ఆ తుంపర్లలో సేదతీరితూ ఎంజాయ్‌ చేస్తుంటారు పర్యటకులు, శివయ్య భక్తులు.. ఈ ఏడాది కూడా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు..

Read Also: Bhagwant Mann: మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన విదేశాంగ శాఖ

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం.. 882.80 అడుగులుగా ఉంది.. శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఇలా.. ఔట్ ఫ్లో రూపంలో శ్రీశైలం నుంచి 1,48,734 క్యూసెక్కుల నీరు.. నాగార్జున సాగర్‌లోకి వెళ్తోంది.. ఇక, ఈ రోజు శుక్రవారం కావడంతో.. శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో.. పర్యటకుల తాకిడితో.. భారీ ఎత్తు ట్రాఫిక్‌ జామ్‌ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే..

Exit mobile version