NTV Telugu Site icon

Srisailam Project: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు

Srisailam Project

Srisailam Project

Srisailam Project: ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఆ నీటిని శ్రీశైలం జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయాని ఇన్‌ఫ్లో 4,052 క్యూసెక్కులు ఉండగా.. దిగువగా నీటిని విడుదల చేయడం లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 809 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 33.7180 టీఎంసీలుగా నమోదైంది.

Read Also: Chandrababu Naidu: చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణం చేస్తారు..?

వివరాలు సంక్షిప్తంగా..

ఇన్ ఫ్లో : 4,052 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటిమట్టం : 885 అడుగులు

ప్రస్తుతం : 809 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 33.7180 టీఎంసీలు