Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఆలయ అధికారులు, అర్చక సిబ్బందితో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఉత్సవాల కాలంలో క్షేత్రానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
నవరాత్రుల సందర్భంగా శ్రీ భ్రమరాంబికాదేవికి నిర్వహించే నవదుర్గ అలంకరణలు, వివిధ వాహనసేవలు, శమీపూజ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించేలా అర్చక బృందంతో సమీక్షించారు. అలాగే క్షేత్రానికి వచ్చే భక్తులకు సులభంగా దర్శనం లభించేలా క్యూలైన్ల నిర్వహణ, వాహనాల పార్కింగ్ వసతులు, ఇతర ప్రాథమిక సౌకర్యాల కల్పనపై అధికారులకు ఈవో పలు మార్గదర్శకాలు చేశారు. ఉత్సవ విశేషాలను మరియు అమ్మవారి సేవలను ఆలయ ప్రాంగణంతో పాటు ప్రముఖ ప్రదేశాలలో భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
దేవస్థానంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించనున్నారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ దసరా ఏర్పాట్లన్నింటినీ ఎక్కడా లోపాలు లేకుండా పగడ్బందీగా పూర్తి చేయాలని ఈవో సూచించారు. ఉత్సవాల సమగ్ర ప్రణాళిక , తుది ఏర్పాట్లపై త్వరలో జరగనున్న ట్రస్ట్ బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. భక్తులందరికీ క్షేమకరమైన, తృప్తికరమైన దర్శన భాగ్యం కల్పించడమే ధ్యేయంగా దేవస్థాన యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!