Site icon NTV Telugu

Srinivas Goud : పొన్నం అన్న ఉద్యమకారుడు.. ఉత్సహవంతుడు మంచి చేస్తాడు..

Srinivas Goud

Srinivas Goud

రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మపాలన సంస్థ.. జైగౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కర్ణాటక కాంగ్రెస్ నేత ఎంఎల్సీ బీకే హరిప్రసాద్ గౌడ్ హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కార్యక్రమానికి గౌడ ప్రతినిధులు.. గౌడ కులస్తులు.. వివిధ రంగాలకు చెందిన గౌడ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పర్మినెంట్‌గా సర్వాయి పాపన్న జయంతి.. వర్ధంతి చేసేలా జీఓ ఇచ్చామని, వైన్స్ షాప్స్ లలో రిజర్వేషన్స్ తీసుకువచ్చాం.. హైదరాబాద్ లో కళ్లు దుకాణాలు పెట్టినమన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు గౌడ్స్ కు సంబంధించిన ఏ అంశం ఉన్న పొన్నంకు చెప్తుండే అని, ఏ సమావేశానికైనా నేనే స్వయంగా పొన్నంకు కాల్ చేసి ఇన్వైట్ చేశానన్నారు. నాకు చేతనైనంత నేను చేశాను.. పొన్నం అన్న కూడా చేస్తాడన్నారు.

Team India Players: భారత ఆటగాళ్లకు నెలకు పైగా సెలవులు!

అంతేకాకుండా..’పొన్నం అన్న ఉద్యమకారుడు.. ఉత్సహవంతుడు మంచి చేస్తాడు.. నేను ఉద్యమకారుడ్ని.. ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తిని.. మేము పోయినం మళ్లీ వస్తాం.. అధికారం శాశ్వతం కాదు.. పొన్నం అన్న ఎంపీగా ఉండే.. గ్యాప్ వచ్చింది.. ఇప్పుడు మంత్రి అయ్యిండు.. ఐక్యంగా ఉంటే పిలిచి మరి ఇస్తారు.. మనమంతా ఐక్యంగా ఉండాలి.. గౌడ్స్ బిల్డింగ్స్ కట్టేది బాకీ ఉంది.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తుందనుకుంటున్న.. బీజేపీ పార్టీకి మూడే సీట్లుండే.. మూడు సార్లు అధికారంలోకి వచ్చారు.. ఏ పార్టీ శాశ్వతంగా సచ్చిపోదు.. మళ్లీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు కోరుకుంటారు..’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

Palnadu: పోటెత్తిన పర్యాటకులు.. ఎత్తిపోతల జలపాతం చూసేందుకు

Exit mobile version