NTV Telugu Site icon

SriMurali : బఘీర గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Bageera (2)

Bageera (2)

 శ్రీ మురళి హీరోగా వస్తున్న చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ  ​​సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన బఘీర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ గురించి పలు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమను 2 సంవత్సరాల షూటింగ్ కాలంలో  మొత్తం సినిమాను 127 రోజుల్లో షూటింగ్ కంప్లిట్ చేసారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స కోసం 5 భారీ సెట్లు నిర్మించారు నిర్మాతలు. ఒక్కో సెట్ నిర్మాణానికి 60 రోజులు పట్టింది. కేవలం ఫైట్ సీక్వెన్స్‌ల కోసం 55 రోజులు సమయం కేటాయించారు. చిత్ర హీరో శ్రీ మురళి ఈ సినిమా కోసం 3 సంవత్సరాల తీవ్రమైన జిమ్ శిక్షణ పొందాడు.
Also Read : KING : వరదల్లో చిక్కుకున్న హీరో అక్కినేని నాగార్జున..
చిత్ర షూటింగ్ సమయంలో హీరోకి గాయాలయ్యాయి, దీని వలన షూటింగ్ 4 నెలలు ఆగిపోయింది. 90% యాక్షన్ సన్నివేశాలను హీరో ఎటువంటి డూప్ లేకుండా నటించాడు. సినిమాలో కీలకమైన చేజ్ సీన్‌లో, హీరో  శ్రీమురళి బస్సు నుండి పడిపోవడంతో తృటిలో గాయం తప్పించుకున్నాడు.127 రోజుల షూటింగ్ లో 60 రోజులు ఓన్లీ రాత్రి వేళలో షూట్ చేసారు. దాదాపు 15-16 సార్లు 24 గంటల పాటు నిరంతరంగా షూట్ చేసారు యూనిట్ సభ్యులు. ప్రశాంత్ నీల్ అందించిన కథ కు స్క్రీన్ ప్లే  స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌కే 2 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాను ఎక్కువగా వైజాగ్, గోవా, హైదరాబాద్, మంగళూరు, బెంగళూరు మరియు మైసూర్ లో చిత్రీకరించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బఘీర దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.