AP New CS Srilakshmi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త సీఎస్ పై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆయన పదవీకాలం పొడగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్ రేసులో పలువురి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అందరికంటే ముందు వరుసలో శ్రీలక్ష్మీ ఐఏఎస్ పేరు ఉంది. జగన్ కూడా ఆమె పనితీరు పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆమె కంటే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్న 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్‌తో పాటు 1988 బ్యాచ్‌కి చెందిన పూనం మాలకొండయ్య, గిరిధర్ పేర్లు కూడా రేసులో వినిపిస్తోన్నాయి. కానీ శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Read Also: Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
1988బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ క్యాడర్‌కు వెళ్లేందుకు ఆమె దరఖాస్తు చేసుకోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ఓఎంసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆమెను సీఎస్‌గా నియమించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఏపీ క్యాడర్‌కు మారిన తర్వాత జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గాలి జనార్థన్ రెడ్డికి అనుకూలంలగా శ్రీలక్ష్మి వ్యవవహరించారనే అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మి చంచల్‌గూడ జైల్లో ఏడాది ఉన్నారు. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత సీబీఐ అభియోగాలను తప్పబడుతూ ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఇటీవల సీబీఐ ఆమెపై నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.