Site icon NTV Telugu

Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ

New Project (48)

New Project (48)

Roshan : ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన సత్తా చాటుతున్నారు. శ్రీకాంత్ తనయుడిగా రోషన్ మేక సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు మూడేళ్లు అవుతోంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రోషన్. 2021లో పెళ్లి సందడి సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Read Also:Jatadhara First Look: సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్ విడుదల..

మళ్లీ ఇన్నాళ్లకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా తెరకెక్కబోతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసి నెలలు గడుస్తోంది. ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో కల్కి ఫేమ్ నాగాశ్విన్ క్లాప్ కొడుతున్నట్లు ఉంది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Read Also:South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..

మరో వైపు.. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ త‌న‌యుడుగా రోష‌న్ మేక కనిపించబోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో వృష‌భ తెర‌కెక్క‌నుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఇంటెన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. భారీ తారాగ‌ణం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్ వండర్ అవుతుందని చెబుతున్నారు.

Exit mobile version