అక్కినేని హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ లభించ లేదుఎంత మంది డైరెక్టర్లు తో సినిమా చేసినప్పటికీ అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయారు. కథల ఎంపికలో అఖిల్ పొరపాటు చేస్తున్నాడా లేకపోతే డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు.కానీ అఖిల్ కు మాత్రం తన కెరియర్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంత కష్టపడినప్పటికీ అఖిల్ కు నిరాశే మిగిలింది.ఏజెంట్ సినిమాతో అఖిల్ క్రేజ్ మారిపోతుంది అని అభిమానులు కూడా భావించగా అందుకు విరుద్ధంగా ఈ సినిమా ఫ్లాప్ అయి అఖిల్ ను కోలుకోలేని దెబ్బ తీసింది.అఖిల్ కెరీర్‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కోసం ఒక మంచి కథ రెడీ చేసారని తెలుస్తుంది.ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పెద కాపు సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన కొత్త నటీనటులతో ఈ సినిమాను చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే అఖిల్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అఖిల్ కోసం ఒక పవర్ పుల్ కథ సిద్దం చేసినట్లు సమాచారం.అది పక్కా యాక్షన్ చిత్రం అని సమాచారం శ్రీకాంత్ అడ్డాల తన కెరీర్ లో తీసిన యాక్షన్ చిత్రం నారప్ప.. ఈ సినిమాలో వెంకటేష్ ను అద్భుతంగా చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప సినిమా ఓటీటీ లో విడుదల అయి మంచి విజయం సాధించింది. దీనితో అఖిల్‌కు ఒక మంచి హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. కథల విషయంలో దిల్ రాజుకు కూడా మంచి అనుభవం ఉంది. దీనితో వీరి కాంబోలో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
