Srikakulam: నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్ చేసి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యాబుద్దులు నేర్చాల్సిన ఉపాధ్యాయురాలు బుద్ధి లేని పని చేసింది. చిన్న పిల్లల(విద్యార్థినులు)తో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో ప్రకారం.. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతుంది. ఇద్దరు విద్యార్థినులు కాళ్లు నొక్కుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Andhra Pradesh: ఏపీలో అమల్లోకి వచ్చిన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం
ఉపాధ్యాయులు ఎలా ఉండాలి..?
పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయులు అతి కీలకం. సమాజంలో కూడా ఉపాధ్యాయులదే అగ్రస్థానం. గురువుగా, తత్వవేత్తగా, ఆచార్యుడిగా, మార్గదర్శకుడిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందుకే ఉపాధ్యాయులు విద్యాపరంగా, మూర్తిమత్వపరంగా సమర్థుడై ఉండాలి. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మొదలైన వాటి సాయంతో ఉపాధ్యాయుడు తన సాధికారతను పెంచుకోవాలి.
READ MORE: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్
