Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో వచ్చేస్తున్న వెన్నెల కిషోర్.. ఫస్ట్ లుక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్ గా రానిస్తూనే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు.శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేశారు.సోమవారం జరిగిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతోనే దర్శకుడిగా అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది.శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ మూడు పాత్రల నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు రైటర్ మోహన్ తెలిపారు.. షెర్ అంటే షర్మిలమ్మ…లోక్ అంటే లోక్‌నాథం…హోమ్ అంటే ఓం ప్రకాష్…ఈ మూడు పాత్రల చుట్టే కథ సాగుతుందని డైరెక్టర్ పేర్కొన్నాడు. రెట్రో బ్యాక్‌డ్రాప్‌లో ఫన్నీ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు చెప్పాడు.
షెర్లాక్‌హోమ్స్‌గా వెన్నెలకిషోర్ పాత్ర ఆద్యంతం నవ్వులను పంచుతుందని తెలిపాడు. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని దర్శకుడు రైటర్ మోహన్ తెలిపారు.. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌లో కొత్త వైబ్ కనిపిస్తోందని, ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి వినోదం ఉంటుదనే నమ్మకం కలుగుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఈ మూవీలో కంప్లీట్ ఫన్‌తో తన క్యారెక్టర్ ఉంటుందని ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌లో అనన్య నాగళ్ల తెలిపింది.ఓ పజిల్‌లా నెక్స్ట్ ఏం జరుగబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తుందని ఆమె చెప్పింది.శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాలో వెన్నెలకిషోర్ తండ్రిగా నాగమహేష్ కనిపించబోతున్నారు.నేనింతే మూవీ హీరోయిన్ శియాగౌతమ్‌తో పాటు రవితేజ మహాదాస్యం మరియు అనీష్ కురివిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!