Sridhar Babu: సిద్దిపేటలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి మంథనికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు వెళ్లిన శ్రీధర్‌బాబు ప్రమాణస్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరిగి తన నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నిర్వహించే ర్యాలీలో శ్రీధర్ బాబు పాల్గొంటారు. కమాన్‌పూర్ నుంచి మంథని వరకు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు శ్రీధర్‌బాబుకు స్వాగతం పలికారు.
Read also: Nagarjuna: నా సామిరంగ… ఏమున్నాడ్రా కింగ్
కాగా, మంథని చేరుకున్న అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలసీలు బాగుంటే వాటిని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణాని అన్నిరంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా నిలపడనికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలవారి సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతాం…అందరిని కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు.
Punjab: కాల్పులతో మారుమోగుతున్న పంజాబ్..11 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు..