మణికొండలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం హైదరాబాద్‌లోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం మణికొండ ప్రాంతంలోని మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో ఉంది. ఇది 500 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ వెలసి పూజలందుకుంటున్నారు. హనుమంతులవారితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, భోళా శంకరుడు కూడా స్వయంభూ దేవతలుగా పూజించబడుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామలవారి ఆలయం కూడా ఉంది. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాలను జరుపుకునేందుకు ఓ విస్తృతమైన ప్రదేశం ఉంది.
ఈ ఆలయం మంచి రవాణా అనుసంధానాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఇది మణికొండ మర్రిచెట్టు బస్ స్టాప్ నుండి కేవలం 100 మీటర్లు దూరంలో ఉంది, అంతేకాకుండా.. ఇక్కడకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం నుండి అనేక బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ హనుమాన్ జయంతి, శివరాత్రి, శ్రీరామ నవమి, బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.