NTV Telugu Site icon

Mathu Vadalara 2 Teaser: వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్‌!

Mathu Vadalara 2 Teaser

Mathu Vadalara 2 Teaser

Mathu Vadalara 2 Teaser Released: రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ తెరకెక్కుతోంది. శ్రీసింహా, సత్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.

‘ఫస్ట్ పార్ట్‌కు నో ఎక్స్పెక్టేషన్స్.. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హై’ అంటూ మత్తు వదలరా 2 టీజర్‌ మొదలైంది. ‘హీ హీ హీ హీటీమా.. అన్నీ హీలు లేవు.. ఒకటే హీ’ అంటూ శ్రీసింహా, సత్యలు కామెడీ చేశారు. ‘ఇది దొంగతనం కాదు.. తస్కరించుట’ అని సత్య చెప్పే డైలాగ్ బాగా నవ్విస్తుంది. ఫరియా అబ్దుల్లా ఫైట్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ ట్రాక్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేయబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌ అంటూ సాగే ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.

Also Read: Nani Movie: నాని-ప్రియదర్శి సినిమాకు ఇంట్రెస్టింగ్‌ టైటిల్.. పోస్టర్ రిలీజ్!

సెప్టెంబర్‌ 13న మత్తు వదలరా 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు కాల భైరవ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు సినిమాపై భారీ బజ్‌ క్రియేట్ చేస్తూ క్యూరియాసిటీ పెంచగా.. టీజర్‌ మరింతగా ఆకట్టుకుంది. ఇందులో సునీల్, అజయ్, రోహిణి కీలక పాత్రలు చేస్తున్నారు.

Show comments