NTV Telugu Site icon

Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!

Sri Ramana

Sri Ramana

Mithunam Movie Story Writer Sri Ramana Dies: ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీరమణ కన్నుమూశారు. ఆయన వయసు 70. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి. దిగ్గజాలు బాపు, రమణలతో పాటు మరెంతో మందితో ఆయన పనిచేశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

నవ్య వారపత్రికకు శ్రీరమణ ఎడిటర్‌గా పనిచేశారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘మిథునం’ సినిమాకు శ్రీరమణ కథ అందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాతిక సంవత్సరాల క్రితం శ్రీరమణ రచించిన 25 పేజీల మిథునం కథను తనికెళ్ళ భరణి అద్భుతంగా తెరకెక్కించారు.

గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న శ్రీరమణ జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. ఆంధ్రజ్యోతి నవ్య, సాక్షి లాంటి పలు తెలుగు పత్రికలకు శ్రీరమణ పని చేశారు. వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా పేరుగాంచారు.సినిమా నిర్మాణంలో సాహిత్య, కళా రంగాలకు ఆయన సేవలందించారు.

Also Read: Engineering Counselling 2023: జులై 24 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌.. ఫీజులు ఇలా!

Also Read: IND vs WI: కేవలం 12 మ్యాచ్‌లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!

Show comments