Site icon NTV Telugu

Sri Ramanavami: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

Vontimitta

Vontimitta

Sri Ramanavami: రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 20న హనుమంత వాహనంపై రాములవారు దర్శనం ఇవ్వనున్నారు. 21న స్వామి వారికి గరుడసేవ నిర్వహించనున్నారు. 22న పండు వెన్నెలలో జరగనున్న కల్యాణ వేడుకలు జరగనున్నాయి. 26న పుష్ప యాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 22న సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్షలాది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Read Also: SeethaRam: వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం.. లక్షకి పైగా భక్తుల రాక..?!

నేడు ద్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 11వ శతాబ్ధంలో నిర్మించిన ఏకశిలానగరి ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి.

 

Exit mobile version