NTV Telugu Site icon

IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్‌.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్‌ ఎవరంటే?

Sri Lanka T20 Squad

Sri Lanka T20 Squad

Sri Lanka T20 Team for India Series: జూన్ 27 నుంచి భారత్‌తో శ్రీలంక మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చరిత్ అసలంక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టీ20ల సిరీస్‌కు అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడిన సీనియర్స్ ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వాలకు శ్రీలంక జట్టులో చోటు దక్కలేదు. సదీర సమరవిక్రమ, దిల్షాన్ మధుశంకలకు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. వీరి స్థానాల్లో చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండోలకు చోటు కల్పించారు. ఫిబ్రవరి 2022లో చివరి టీ20 మ్యాచ్‌ ఆడిన సీనియర్ దినేష్ చండిమాల్‌కు జట్టులో చోటు దక్కింది. పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి.

టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు సోమవారం శ్రీలంక చేరుకుంది. నేటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ టూర్‌కు సంబంధించి భారత జట్లను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత జట్టుకు టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌, వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు.

Also Read: Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ అప్‌డేట్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌!

శ్రీలంక టీ20 జట్టు:
చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిశాంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, డాసున్ శనక, వానిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశా పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినూర ఫెర్నాండో.

Show comments