మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad to Complain BCCI Over Avesh Khan Incident: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతితో ఘోరంగా ఓడిపోయింది. అయితే.. ఈ సీజన్ ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసి రాలేనట్టుంది. వరుసగా వివాదాలు హైదరాబాద్ టీమ్‌ను చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేయాలని సన్‌రైజర్స్ నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ నివేదించింది. ముఖ్యంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ‘అవేష్ ఖాన్ ఘటన’ సన్‌రైజర్స్ యాజమాన్యానికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
READ MORE: Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక చర్చలు..
Also Read
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. లక్నో గెలుపునకు రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సిన ఉండేది. ఈ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో బౌండరీ లైన్ అవతల డగౌట్ సమీపంలో ఉన్న లక్నో ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్, తన చేతిలో ఉన్న బ్యాట్‌తో ఆ బంతిని వెనక్కి కొట్టాడు. అయితే, అవేష్ బంతిని తాకే సమయానికి అది ఇంకా బౌండరీ లైన్‌ను దాటలేదని రిపీట్లలో స్పష్టమైంది. దీంతో నిబంధనల ప్రకారం తమకు ఐదు పెనాల్టీ పరుగులు కేటాయించాలని సన్‌రైజర్స్ వాదించింది. కానీ, అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరని, బంతి ఎలాగూ బౌండరీకి వెళ్లేదే కాబట్టి పెనాల్టీ ఇచ్చే అవకాశం లేదని అంపైర్లు స్పష్టం చేయడంతో వివాదం చెలరేగింది. కేవలం ఈ ఒక్క ఘటనే కాకుండా అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లోని అంపైరింగ్ నిర్ణయాలపై కూడా సన్‌రైజర్స్ గుర్రుగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పట్టే సమయంలో ఫీల్డర్ ఫిల్ సాల్ట్ కాలు బౌండరీ కుషన్‌కు తగిలిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్‌ను వరుణ్ చక్రవర్తి సరిగ్గా అందుకున్నాడా లేదా అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఆ సమయంలో అభిషేక్ తీవ్ర ఆగ్రహంతో మైదానాన్ని వీడటం చర్చనీయాంశమైంది. ఈ వరుస వివాదాల నేపథ్యంలో బీసీసీఐతో సంప్రదింపులు జరిపే పనిలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు