Site icon NTV Telugu

SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్‌, అక్షర్ పటేల్ ఆడతారా.?

Srh Vs Dc Playing Xi

Srh Vs Dc Playing Xi

SRH vs DC Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్ తమ హోమ్ గ్రౌండ్ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి, మూడింట ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. దీనితో ఇరుజట్లు కూడా తమ విజయాల జోరు కొనసాగించాలని చూస్తున్నాయి.

TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?

అయితే ఈ మ్యాచ్‌ కు ముందు ఇరుజట్లను గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మిచ్చెల్ స్టార్క్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీకి మరో షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం కారణంగా క్రితం మ్యాచ్‌ లో మధ్యలోనే మైదానం వీడాల్సి వచ్చింది. అయితే ఆ జట్టు డైరెక్టర్ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. అక్షర్‌ కు వచ్చినది కేవలం ఓ చిన్న క్రాంప్ మాత్రమేనని, నెక్స్ట్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటాడని తెలిపారు. దీంతో ఈరోజు మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి.

మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌కు పాట్ కమ్మిన్స్ పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా మ్యాచ్ లకు దూరంగా ఉన్న కమిన్స్ ఈ మధ్యే జట్టుతో చేరాడు. అయితే ఫిట్‌నెస్ పూర్తిగా రికవర్ కాకపోవడంతో మ్యాచ్‌ కు ఇంకా సిద్ధంగా లేడని తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి ఇప్పటికే స్పష్టం చేశారు. కమిన్స్ ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనితో ఈరోజు మ్యాచ్‌లో కమిన్స్ ఆడే అవకాశం దాదాపు లేనట్లే.

Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (C), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషాన్ మలింగా.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేయింగ్ XI:
పాథుమ్ నిస్సాంకా, కేఎల్ రాహుల్ (W), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (C) / విప్రజ్ నిగమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆక్విబ్ నబీ దర్, లుంగి ఎన్‌గిడి, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ముకేశ్ కుమార్.

Exit mobile version