Site icon NTV Telugu

SRH IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిస్క్ చేయబోతుందా.. రూ.23 కోట్ల స్టార్ రిటెన్షన్ జాబితాలోకి..?

Heinrich Klaasen

Heinrich Klaasen

SRH IPL 2026: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేయడానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబర్ 15 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. జట్లలోని ఆటగాళ్ల మార్పులపై ఊహాగానాలు, నివేదికలు అమాంతం పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ నివేదిక ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోని స్టార్ ఆటగాడు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది క్లాసెన్‌ను SRH ఐపీఎల్ రికార్డు రిటెన్షన్ ధర రూ. 23 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఇతర ఫ్రాంచైజీలు కూడా క్లాసెన్ పై నిఘా ఉంచాయని.. తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Kartik Purnima 2025: పవిత్రత, భక్తి, దీపాల వెలుగులతో 2025 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..

ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించక ఆరో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ వేలం ప్రణాళికలపై ఇప్పటికే చర్చలు జరిపింది. కాకపోతే, క్లాసెన్ గత సీజన్‌లో SRH తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 13 ఇన్నింగ్స్‌లలో 172కి పైగా స్ట్రైక్ రేట్‌ తో 487 పరుగులు చేశాడు. మొత్తంగా క్లాసెన్ గత మూడు ఐపీఎల్ సీజన్లలో ప్రతి ఒక్క దానిలోనూ 170కి పైగా స్ట్రైక్ రేట్‌తో 400లకు పైగా పరుగులు చేసి జట్టుకు ఫలితాలను అందిస్తున్నాడు.

Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి

ఒకవేళ క్లాసెన్‌ను విడుదల చేస్తే, SRH అతన్ని తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయడానికి మళ్లీ ప్రయత్నించవచ్చని కూడా ఈ నివేదిక పేర్కొంది. సుమారు రూ. 15 కోట్లకు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడిని తిరిగి పొందే అవకాశం ఉండొచ్చని పేర్కొంది. ఇలా చేయడంతో మిగితా డబ్బుతో మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడానికి సహాయపడుతుందని ఆ వర్గాలు నివేదికలో తెలిపాయి.

Exit mobile version