NTV Telugu Site icon

Sreleela : ఆ తమిళ్ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీలీల..?

Whatsapp Image 2023 06 11 At 6.26.02 Pm

Whatsapp Image 2023 06 11 At 6.26.02 Pm

శ్రీలీల కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా అయితే కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరో అయిన మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధం గా ఉన్నారని తెలుస్తుంది.అయితే శ్రీలీల కు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు ఎక్కువ గానే వస్తున్నాయని తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరోల లో ఒకరైన విశాల్ కు జోడీ గా నటించే అవకాశం రాగా శ్రీలీల నో చెప్పారని సమాచారం.. విశాల్ సినిమా ను శ్రీలీల రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుండ గా ఈ కామెంట్ల పై శ్రీలీల ఏ విధంగా స్పందిస్తారో అయితే చూడాలి.

ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల కు కాల్ షీట్స్ కేటాయించలేని పరిస్థితి లో శ్రీలీల ఉన్నారని తెలుస్తుంది.సాధారణం గా సినిమా ఇండస్ట్రీలో ఆదివారం షూటింగ్స్ సెలవు ఉంటుంది.. అయితే శ్రీలీల మాత్రం ఆదివారం రోజున కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల చేసే సినిమాలు ఆమె రేంజ్ పెంచుతాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు.. శ్రీలీల పారితోషికం కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంది.. శ్రీలీల రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో కూడా సత్తా చాటే అవకాశం కూడా ఉంది.. శ్రీలీల రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని అద్భుత విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి ..కథ నచ్చితే కనుక సీనియర్ హీరోల కు జోడీగా నటించడానికి కూడా శ్రీలీల సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే..

Show comments