టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది..నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా మంచి వసూళ్ళు రాబట్టడానికి శ్రీలీల అభినయమే కారణమని చాలామంది కూడా భావిస్తారు. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న శ్రీలీల ఆ క్రేజ్ కు అనుగుణంగా అవకాశాలను అందుకుంటుంది.టాలీవుడ్ లో ఇప్పుడు బాగా ఆఫర్స్ తో బిజీగా వున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు శ్రీలీల పేరు సమాధానంగా వినిపిస్తోంది. గ్లామర్ రోల్ అయినా ట్రెడిషనల్ పాత్ర అయినా తన నటన తో శ్రీలీల సత్తా చాటుతుంది.. అయితే ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్రాంగద అనే సినిమా లో నటించారని ఒక ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. సింధు తులాని చిన్నప్పటి పాత్ర లో శ్రీలీల ఈ సినిమాలో కనిపించడం విశేషం..
శ్రీలీల రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో నే ఉన్నా ప్రేక్షకుల్లో ఆమె కు వున్న భారీ క్రేజ్ కారణం గా ఆమె కు ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ గా ఉన్నారు. ఇతర ఇండస్ట్రీలలో కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తుండగా శ్రీలీల మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ల ను రిజెక్ట్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.తొలి సినిమా నే డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా కూడా ఆ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడం శ్రీలీలకు కలిసి వచ్చింది.శ్రీలీల రాబోయే రోజుల్లో మరింత రేంజ్ కు వెళ్తుందేమో చూడాలి.బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా శ్రీలీలకు ఆసక్తి ఉండగా సరైన ఆఫర్లు కనుక వస్తే బాలీవుడ్ పై ఫోకస్ చేయాలని కూడా ఈ బ్యూటీ భావిస్తున్నట్లు సమాచారం.శ్రీలీల ఇతర భాషల్ల్లో కూడా ఛాన్స్ లు కొట్టేస్తే పాన్ ఇండియా హీరోయిన్ గా మారే అవకాశం కూడా ఉంది.