Site icon NTV Telugu

Sreenidhi Engineering College: బీటెక్ విద్యార్థి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు!

Student Missing

Student Missing

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న అజితేష్ (20) అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. వారాసిగూడలో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పినట్లు అజితేష్ తండ్రి రామకృష్ణకి విద్యార్థి స్నేహితులు చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడతో.. అజితేష్ తండ్రి ఈరోజు పోచారం పోలీసులకు పిర్యాదు చేశారు. తండ్రి పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సెక్రటరీ తరఫున కొనసాగనున్న వాదనలు!

కరీంనగర్‌కి చెందిన అజితేష్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. పోచారంలోని యన్నంపేటలో స్నేహితులతో కలిసి అద్దే రూంలో ఉంటూ.. కళాశాలకు వెళ్తున్నాడు. మార్చి 23న కరీంనగర్‌కి వెళ్లిన అజితేష్.. 28న తిరిగి యన్నంపేటలోని రూంకి వచ్చాడు. 29న వారాసిగూడలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు వెళ్తాను అని ఇంట్లో, రూమ్ మెంట్స్ కి చెప్పి వెళ్ళాడు. తండ్రి రామకృష్ణ 29న సాయంత్రం అజితేష్ కి ఫోన్ చేయగా.. ఫోన్ స్విచ్ రావడంతో రూమ్ స్నేహితులను సంప్రదించాడు. వారాసిగూడ లో ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పినట్లు అజితేష్ తండ్రికి వారు చెప్పారు. అజితేష్ సమాచారం తెలియకపోవడతో పోచారం పోలీసులకు ఈ రోజు రామకృష్ణ పిర్యాదు చేశారు. తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version