Site icon NTV Telugu

Sreeleela Viral Video: ఈసారి ఆ తమిళ హీరోతో ‘కుర్చీ మడతబెట్టి’ పాటకు స్టెప్పులేసిన శ్రీలీల..!

10

10

గుంటూరు కారం.. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ ఫలంగా విజయం సాధించిన.. స్టోరీ పరంగా మాత్రం కాస్త నిరాశనే మిగిలించింది. మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను పొందింది. ఈ సినిమా టాక్ మొదట్లో భిన్నంగా ఉన్న.. రాను రాను సూపర్ హిట్ టాక్ అందుకొని బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Also read: ECIL Recruitment: ఈసీఐఎల్‌ – హైదరాబాద్‌ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా..!

ఇక సినిమా ఒక ఎత్తైతే.. అందులోని పాటలు మాత్రం మరో ఎత్తు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను సమకూర్చాడు. సినిమాలోని పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి సినిమా మ్యూజిక్ ను అదరగొట్టాడు థమన్. ఇక సినిమాలోని ‘కుర్చి మడతపెట్టి’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ ప్రభంజనమే సృష్టించింది అని చెప్పవచ్చు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్స్ వేసిన మాస్ స్టెప్స్ ను అనుసరిస్తూ ఓ రేంజ్ లో పాటను ట్రెండిగా చేశారు.

Also read: IPL 2024: మ్యాచ్ ఓడినా రూ.24 కోట్ల బౌలర్ ​ను బెంబేలెత్తించిన సన్ ​రైజర్స్ బ్యాటర్స్..!

ఇకపోతే తాజాగా హీరోయిన్ శ్రీలీలా ఈ పాటకు మరోసారి స్టెప్పులేసింది. అయితే ఈసారి మహేష్ బాబు బదులు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో కలిసి ఈ డాన్స్ వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని ధనలక్ష్మి శ్రీనివాస్ యూనివర్సిటీలో శనివారం నాడు జరిగిన అనంత కల్చరల్ ఫెస్టివల్ లో శివ కార్తికేయన్, శ్రీ లీలలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో స్టూడెంట్స్ కోరిక మేరకు వారిద్దరు కలిసి ‘కురిచి మడతపెట్టి’ వాళ్లకు స్టెప్పులు వేశారు.

Exit mobile version