NTV Telugu Site icon

Sreeleela : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల..?

Sreleela

Sreleela

Sreeleela :  టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సంద D “సినిమాతో ఈ భామ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన శ్రీలీల లుక్స్ మరియు డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఆ తరువాత ఈ భామ మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో ఈ అమ్మడి డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమాతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి.ఒకానొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ కాక చాల సినిమాలను ఈ భామ వదులుకోవాల్సి వచ్చింది.

Read Also :Kalki 2898 AD : అమితాబ్ ‘అశ్వద్దామ’ న్యూ లుక్ వైరల్..

ఇదిలా ఉంటే ఈ భామకు వరుస ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు.ఈ భామ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయిన కూడా ఆ సినిమాలో శ్రీలీలకు యాక్టింగ్ స్కోప్ ఉండదు.అయితే ఆ సినిమాలో ఈ అమ్మడి డాన్స్ మాత్రం అదరగొట్టిందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది.అయితే ఆ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది.త్వరలోనే మళ్ళీ స్టార్ట్ కానుంది.ఇదిలా ఉంటే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దిలర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు ఓ వార్త బాగ్ వైరల్ అవుతుంది.మాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.