Sreeleela : టెలికాం కంపెనీ యాడ్ ట్యాగ్ లైన్ ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు! ఒక్క పాట శ్రీలీల జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె కెరీర్ ఓ కొత్త టర్నింగ్ నే తీసుకొస్తుందా? అంటే అవునని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించిన ‘పుష్ప-2’ లోని కిసిక్ పాటతో పాన్ ఇండియాలో ముద్దుగుమ్మ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. కిస్ కిస్ కిసిక్ అంటూ కుర్రాళ్లను నిద్రపోనీయకుండా చేసేసింది. అప్పటి వరకూ హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఒక్క సారిగా ఐటం భామగా తెరపై కనిపించే సరికి కొత్త ఇమేజ్ క్రియేట్ అయింది. వాస్తవానికి శ్రీలీల మంచి డాన్సర్ కావడంతోనే ఆమెకు ఈ చాన్స్ వచ్చిందని చెప్పాలి. పాటలో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్, హిప్ మూవ్ మెంట్స్ ప్రతీది యూత్ కు పర్పెక్ట్ గా కనెక్ట్ అయింది. దీంతో శ్రీలీలకు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ లో నర్తించే అవకాశాలే వస్తున్నాయని వినిపిస్తుంది. సొగసరిని రెండు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఐటం సాంగ్ కోసం అప్రోచ్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శ్రీలీల కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్నట్లే అంటున్నారు. బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది.
Read Also:Game Changer : నేడు గేమ్ ఛేంజర్ ‘డోప్’ సాంగ్ రిలీజ్.. ఏ టైంకు వస్తుందంటే ?
స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తే హీరోయిన్లే ఐటం భామలుగా మారిపోతారు. అలాగే ఐటం సాంగ్స్ కంటూ కొంత మంది స్పెషలిస్ట్ లు ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో. మలైకా అరోరా, జాక్వెలిన్ పెర్నాండేజ్, నోరా పతేహీ, మల్లికా షెరావత్ లాంటి వాళ్లు ఐటం భామలుగా చాలా పాపులర్.. కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు ఐటం పాటల్లో నటించారు. వాళ్లను కాదని ఐటమ్ సాంగ్స్ మరో హీరోయిన్ కు అదీ తెలుగు హీరోయిన్ కు రావడం అన్నది అంత సులభం కాదు. కానీ ఇప్పుడా బోర్డర్ ను శ్రీలీల దాటుతున్నట్లే కనిపిస్తుంది. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోగల్గితే శ్రీలీల మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోతుంది. మరి ఆ ఛాన్స్ తీసుకుంటుందా? లేదా? అనేది మాత్రం భవిష్యతులో చూడాలి.
Read Also:Govt Shutdown: షట్‌డౌన్ గండం నుంచి తప్పించుకున్న అమెరికా..