Sreeleela: పాపం శ్రీలీలకు లక్ కలిసి రావడం లేదు. ఈ అందాల భామ ఎంత ప్రయత్నించినా హిట్ కొట్టలేక పోతుంది. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంటూ టాలీవుడ్ వదిలి కోలీవుడ్‌లో అయిన హిట్ కొట్టాలని ట్రై చేస్తే అక్కడ కూడా తనకు అదృష్టం కలిసి రాలేదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అంటూ ఇండస్ట్రీలో ఉన్న అందరితో కలిసి తెరపై కనువిందు చేసినా పాపం తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటే. ఈ చిత్రంతో తమ హీరోయిన్ కచ్చితంగా సక్సె్స్ అందుకుంటుందని ఆశపడుతూ.. సినిమా రిలీజ్ అయిన తర్వాత నిరాశ పడటం అలవాటుగా మారింది ఆవిడ అభిమానులకు.
నిజానికి ధమాకా తరువాత శ్రీలీల సినీ కెరీర్‌లో చేసిన సుమారు అన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇదేదో తేడా ఉందే అంటూ టాలీవుడ్ సరిహద్దులు దాటి కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని పరాశక్తితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా నటించిన చిత్రమే పరాశక్తి. ఇందులో రవి మోహన్ విలన్ గా కనిపించగా.. అథర్వ కీలక రోల్ ప్లే చేశాడు. భారీ అంచనాల మధ్య జనవరి 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రత్నమాలగా కనిపించిన శ్రీలీల నటనపై తమిళ ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. పాపం వాస్తవానికి ఈ సినిమా కోసం శ్రీలీల విశేషంగా కష్టపడింది. తన లుక్ మొత్తం మార్చేసింది, అయినా కూడా సక్సెస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. చూడాలి మరి శ్రీలీలకు హిట్ అందించే నెక్ట్స్ సినిమా ఏమౌతుందో అనేది.
READ ALSO: India: రష్యా లేదా వెనిజులా.. ఏ దేశ చమురు ఇండియాకు బెనిఫిట్!
