Sree leela says her admiration of becoming docter: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీ లీల మీడియాతో ముచ్చటిస్తూ ‘భగవంత్ కేసరి’ విశేషాలు పంచుకున్నారు.
Renu Desai: టైగర్ ట్రైలర్ చూసి నా కూతురు అలాంటి మాట అంటుందని ఊహించలేదు!
ఇక అదే సమయంలో తన డాక్టర్ చదువు గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. తాను చాలా ఇష్టపడి డాక్టర్ అవ్వాలని చదువుతున్నానని ఇందులో తన తల్లి బలవంతం ఏమీ లేదని అన్నారు. తన తల్లి డాక్టర్ అని పేర్కొన్న ఆమె తన అన్న కూడా డాక్టర్ అని అన్నారు. ఒకరోజు తాను మెడిసిన్ ఎంట్రెన్స్ కూడా రాయక ముందు తన అమ్మమ్మ పడిపోయారని తనకు ఏమి చేయాలో కాలు చేయి ఆడలేదని అన్నారు. అయితే డాక్టర్ ఐన తన అన్న వచ్చి సీపీఆర్ ఇవ్వగానే ఆమె లేచి కూర్చున్నారని శ్రీ లీల చెప్పుకొచ్చారు. సీపీఆర్ అనేది చాలా చిన్న విషయమే కానీ డాక్టర్ కాబట్టే ఆ విషయం తెలిసింది అనిపించింది. అప్పుడే మెంటల్ గా ఫిక్స్ అయ్యా ఎన్ని కష్ట నష్టాలూ వచ్చినా డాక్టర్ అవ్వాలని అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తన తల్లితో కూడా చెప్పలేదని మొదటిసారిగా మీకే చెబుతున్నాయి అని ఆమె చెప్పుకొచ్చారు.