Vaibhav Suryavanshi: ఐసీసీ పురుషుల అండర్ 19 ప్రపంచ కప్ 2026 తాజాగా స్టా్ర్ట్ అయ్యింది. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ భారత – యునైటెడ్ స్టేట్స్ జట్టుతో తలపడింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బులవాయో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 25.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైన మనోడు నయా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ వైభవ్ మొత్తం నాలుగు బంతులను ఎదుర్కొని, రెండు పరుగులు మాత్రమే చేశాడు.
READ ALSO: Artemis II: చందమామ చెంతకు మళ్ళీ మనిషి.. ఫిబ్రవరి 6న నాసా ప్రయోగం.!
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ..
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించకపోయినా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఐసిసి అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. USAతో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ మైదానంలోకి దిగినప్పుడు, అతని వయస్సు 14 సంవత్సరాల 294 రోజులు మాత్రమే. వైభవ్ సూర్యవంశీ కంటే ముందు ఈ ప్రపంచ రికార్డు కెనడా ఆటగాడు నితీష్ కుమార్ పేరిట ఉంది. నితీష్ కుమార్ 15 సంవత్సరాల 245 రోజుల వయసులో ICC పురుషుల అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు. భారత సంతతికి చెందిన ఇతను కెనడా తరఫున ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ టైంలో కెనడా తరఫున ఆడటమే కాకుండా, ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ ప్లేయర్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ జాతీయ జట్టు తరపున ఆడుతున్నాడు. అతను 2024 T20 ప్రపంచ కప్‌లో కూడా భాగంగా ఉన్నాడు.
READ ALSO: Sankranti: కాశీ నుంచి కన్యాకుమారి దాకా.. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసా?
