Sania Mirza: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు కొత్త పాత్రలోకి అడుగు పెట్టారు. ఇండియాలో మహిళల టెన్నిస్‌ను ప్రోత్సహించడానికి ఆమె ఒక ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన సానియా మంగళవారం ‘ది నెక్స్ట్ సెట్’ అనే పేరుతో కంపెనీని ప్రకటించింది. ‘ది నెక్స్ట్ సెట్’ లక్ష్యం భారతదేశంలోని అగ్రశ్రేణి, అభివృద్ధి చెందుతున్న మహిళా అథ్లెట్లకు సలహా, మద్దతు అందించడం. సానియా ప్రారంభించిన ఈ సంస్థ మహిళా టెన్నిస్ క్రీడాకారులకు సహాయం చేస్తుంది, వారిని మరింత ప్రొఫెషనల్‌గా మార్చడానికి కృషి చేస్తుంది.
సానియా మీర్జా కంపెనీ ప్రాథమిక లక్ష్యం.. మహిళా క్రీడాకారులకు కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, టోర్నమెంట్ అంతటా వారితో ప్రయాణించే శిక్షకులను అందించడం. వీటికి అదనంగా సానియా మీర్జా అకాడమీ ప్రత్యేక టెన్నిస్ శిబిరాలు, కోచింగ్ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. ఈ వర్క్‌షాప్‌లు ఆటగాళ్ల సాంకేతిక, వ్యూహాత్మక, శారీరక, మానసిక అంశాలపై కూడా దృష్టి సారిస్తాయి. ఈసందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ.. “తదుపరి సెట్ తనకు చాలా ప్రత్యేకమైనది” అని అన్నారు. “తదుపరి సెట్ నాకు చాలా దగ్గరగా ఉంది. క్రీడలో నా స్వంత ప్రయాణంలో ఒడిదుడుకులను వ్యక్తిగతంగా అనుభవించిన నాకు, సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వం, సలహాతో మీ కెరీర్‌ను ఎలా మంచి దారివైపు తీసుకెళ్లాలో తెలుసు” అని చెప్పారు. “భారతీయ మహిళా టెన్నిస్‌లో అపారమైన ప్రతిభ ఉంది, సరైన మద్దతుతో, మన క్రీడాకారులు పెద్ద కలలు కనవచ్చు, ప్రపంచ స్థాయిలో పోటీ పడవచ్చు. ఈ చొరవ తరువాతి తరానికి బలమైన మార్గాలను నిర్మించడానికి, దోహదపడటానికి ఉపయోగపడుతుంది” అని వివరించారు.
సానియా మీర్జా కెరీర్ విషయానికి వస్తే..
సానియా మీర్జా భారతదేశంలో అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె తన కెరీర్‌లో ప్రైజ్‌మనీ రూపంలో $7.2 మిలియన్లకు పైగా గెలుచుకుంది. ఆమె డబుల్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది, అలాగే ఆరు గ్రాండ్‌స్లామ్‌లను కూడా సొంతం చేసుకుంది. ఆమె మహిళల డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లను, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది.
READ ALSO: Jr NTR – Kalyan Ram: బద్ధశత్రువులుగా అన్నదమ్ములు.. దేవర కథకి షాకింగ్ ట్విస్ట్ !
