Site icon NTV Telugu

India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand 3rd T20: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బరసపర క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అయ్యింది . టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

READ ALSO: BJP Leader: మమతా బెనర్జీ మంత్రగత్తె, ఆమె తల నరకాలి.. వివాదంగా బీజేపీ నేత వ్యాఖ్యలు..

పిచ్ పరిస్థితి ఎలా ఉందంటే..
బర్సపారా క్రికెట్ స్టేడియం సాధారణంగా బ్యాట్స్‌మన్‌లకు అనుకూలమైన వేదికగా చెబుతున్నారు. ఇక్కడ జరిగిన చివరి T20Iలో 220 కంటే ఎక్కువ పరుగులు నమోదయ్యాయి. కాబట్టి మరో హై-స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. చిన్న బౌండరీలు ఉండటం, ఫ్లాట్ పిచ్ బౌలర్లకు సవాలుగా మారవచ్చు. భారత్‌కు ఈ మ్యాచ్ సిరీస్ గెలవడానికి మాత్రమే కాకుండా టీ20 ప్రపంచ కప్‌కు ముందు తమ జట్టు బలోపేతం చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉపయోగపడనుంది. న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ సిరీస్‌లో నిలవడానికి కీలకం కానుంది.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

భారత్ (ప్లేయింగ్ XI): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన 0.3 ఓవర్‌కు డెవాన్ కాన్వే (1) హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ షాక్‌ నుంచి తేరుకోక ముందే న్యూజిలాండ్‌కు మరొక షాక్ తలిగింది. పాండ్యా బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర ఔట్ అయ్యాడు.

READ ALSO: Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసుకోండి!

Exit mobile version