Site icon NTV Telugu

Jacob Martin : ఫుల్లుగా తాగి కారుతో క్రికెటర్ బీభత్సం.. అరెస్ట్ చేసిన పోలీసులు

Jacob Martin

Jacob Martin

Jacob Martin : భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను ఈ రోజు వడోదరలో అరెస్టు చేశారు. మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీకొట్టినందుకు ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నివేదికల ప్రకారం.. మార్టిన్ అకోటా ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటలకు మద్యం మత్తులో తన కారుపై నియంత్రణ కోల్పోయి, ఒక ఇంటి బయట ఆగి ఉన్న మూడు SUV లను ఢీకొట్టాడు. దీంతో మార్టిన్‌పై కేసు నమోదైంది. మద్యం తాగి వాహనం నడుపుతున్నందుకు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

READ ALSO: IND vs ZIM U19: విహాన్ మల్హోత్రా, వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే పై 204 పరుగుల తేడాతో భారత్ విక్టరీ

మార్టిన్ భారతదేశం తరపున 10 ODIలు ఆడాడు. అతను 1990లలో భారత జట్టులోకి వచ్చారు, అయినప్పటికీ కూడా మార్టిన్ కెరీర్ స్వల్పకాలికంగా కొనసాగింది. 2011లో కూడా జాకబ్ మార్టిన్ వార్తల్లో నిలిచారు. ఆ టైంలో మార్టిన్‌ను మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జాకబ్ మార్టిన్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్లతో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఆయన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 22.57 సగటుతో 158 పరుగులు చేశారు. వన్డే క్రికెట్‌లో మార్టిన్ స్ట్రైక్ రేట్ కేవలం 47.73 మాత్రమే. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు.

దేశీయ క్రికెట్ కెరీర్ ఇదే..
జాకబ్ మార్టిన్ అంతర్జాతీయ కెరీర్ ఫాస్ట్‌గానే క్లోజ్ అయ్యి ఉండవచ్చు, కానీ దేశీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించారు. మార్టిన్ 138 మ్యాచ్‌ల్లో 46 కంటే ఎక్కువ సగటుతో 9,192 పరుగులు చేశారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మార్టిన్ 23 సెంచరీలు చేశారు. లిస్ట్ ఎ క్రికెట్‌లో, జాకబ్ మార్టిన్ 96 ఇన్నింగ్స్‌ల్లో 39.30 సగటుతో 2,948 పరుగులు చేశారు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి.

READ ALSO: Foldable Houses: ఫోల్డబుల్ ఇల్లు వచ్చేశాయ్.. 4 గంటల్లోనే మీ సొంత ఇల్లు రెడీ!

Exit mobile version