Site icon NTV Telugu

Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!

Rohit Sharma

Rohit Sharma

Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్ ఇప్పటికి కొన్ని అలాగే ఉన్నాయి. నిజానికి ప్రతిరోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతుండగా, నేటికి కొన్ని అన్ బ్రేకబుల్ రికార్డులు అలాగే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ రికార్డ్స్ ఏ రేంజ్‌లో ఉండి ఉంటాయో అనేది. అవే ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు గొప్ప రికార్డులు. ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో నమోదు చేసిన రికార్డ్‌ను, క్రికెట్ దేవుడుగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఇంతకీ ఆ నాలుగు రికార్డులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

READ ALSO: YS Jagan: రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపులు పెరిగిపోయాయి..

జాక్ హాబ్స్ కెరీర్..
22 గజాల పిచ్‌పై హాబ్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా, బౌలర్లు మామూలు ఇబ్బంది పడేవారు కాదు. జాక్ హాబ్స్ క్రికెట్ కెరీర్ 29 సంవత్సరాలు కొనసాగింది. అతను 834 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 199 సెంచరీలు, 273 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మన్‌కు సాధ్యం కాని విధంగా హాబ్స్ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొత్తంగా హాబ్స్ 61,760 పరుగులు చేశాడు. అతను 1905 నుంచి 1934 వరకు క్రికెట్ ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో హాబ్స్ అత్యుత్తమ స్కోరు 316 నాటౌట్. 1908లో టెస్ట్ అరంగేట్రం చేసిన హాబ్స్, 61 మ్యాచ్‌ల్లో 56 సగటుతో 5,410 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నిజానికి హాబ్స్ రికార్డును బద్దలు కొట్టడం నేడు ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్‌కైనా అంత తేలికైన పని కాదు.

డాన్ బ్రాడ్‌మాన్..
ఆస్ట్రేలియన్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ క్రికెట్‌లో 99.94 సగటును కలిగి ఉన్నాడు. నిజానికి బ్రాడ్‌మాన్ తన చివరి ఇన్నింగ్స్‌లో ఇంకా 4 పరుగులు చేసి ఉంటే, అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు 100 అయ్యేది. కానీ ఈ గొప్ప క్రికెటర్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. 52 టెస్ట్ మ్యాచ్‌లలో బ్రాడ్‌మాన్ 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఈ సగటును సొంతం చేసుకోలేపోయాడు.

హిట్ మ్యాన్ 3 డబుల్ సెంచరీలు..
వన్డేల్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ వన్డేల్లో 264 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో శ్రీలంకపై ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు రోహిత్ శర్మ సొంతం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ హిట్ మ్యాన్ ఒక్కడే.

ఒకే టెస్ట్‌లో 19 వికెట్లు..
ఇంగ్లాండ్ మాజీ బౌలర్ జిమ్ లేకర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 19 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ప్రపంచంలో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్ జిమ్ లేకర్. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో లేకర్ మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టాడు. జిమ్ లేకర్ రికార్డును బద్దలు కొట్టాలంటే, ఒక బౌలర్ రెండు ఇన్నింగ్స్ లలో 10 వికెట్లు తీయాలి. నిజానికి ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసే వ్యక్తి సమీప భవిష్యత్తులో ఎవరూ కనిపించడం లేదు.

READ ALSO: Golla Ramavva: ఈటీవీ విన్’లో “గొల్ల రామవ్వ” స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Exit mobile version