Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. సెంచరీలతో రికార్డ్‌లు బద్ధలు కొట్టే ఈ క్రికెటర్‌ను దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదు. ప్రస్తుతం ఈ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరుఫున ఆడుతున్నాడు. ఇప్పటికే మహారాష్ట్ర చేతిలో భారీ ఓటమితో అవస్థలు పడుతున్న ముంబై జట్టుకు ఒక బ్యా్డ్ న్యూస్. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ గాయంతో జట్టు నుంచి దూరం అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్‌ల దశకు చేరుకోవడానికి ముంబైకి ఒక గొప్ప విజయం అవసరం, ఈ టైంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ గాయపడటం నిజంగా జట్టకు బ్యాడ్ న్యూసే. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌కు ఈ ప్లేయర్ దూరంగా ఉన్నాడు. వాస్తవానికి గాయం కారణంగానే ఆయన ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తాజాగా తెలిసింది. గత ఏడాది కాలంగా సర్ఫరాజ్ ఖాన్ అనేకసార్లు గాయపడ్డాడు.
READ ALSO: Latest Weather Update: చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా పొంచి ఉన్న సంక్రాంతి ముప్పు
28 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ గత 12 నెలలుగా వరుస ఎదురుదెబ్బలు తిన్నాడు. ఈ ఎదురుదెబ్బలు అనేవి 2024–25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో ఈ ప్లేయర్ పక్కటెముక విరిగింది. ఈ గాయం అతన్ని 2024–25 రంజీ ట్రోఫీ రెండవ ఎడిషన్‌లో ఆడకుండా చేసింది. కోలుకున్న తర్వాత ఆయన ఇంగ్లాండ్ టెస్ట్ టూర్‌కు ఎంపిక కాకపోవడంతో, సర్ఫరాజ్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ టైంలో ఆయన దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. కానీ 2025–26 దేశీయ సీజన్ ప్రారంభానికి ముందు, బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ఆడుతున్నప్పుడు ఆయన తొడ (క్వాడ్రిసెప్స్) గాయంతో బాధపడ్డాడు. దీని కారణంగా ఈ ప్లేయర్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు, అలాగే ఈ గాయం మనోడికి ఇండియా A, టెస్ట్ జట్లకు ఎంపికయ్యే అవకాశాలపై కూడా ప్రభావం చూపింది.
అయినప్పటికీ సర్ఫరాజ్ కోలుకుని అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆయన తన తొలి T20 సెంచరీని సాధించాడు. 2025–26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో IPL కాంట్రాక్టును కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 2025–26 విజయ్ హజారే ట్రోఫీలో కూడా మనోడు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కానీ దురదృష్టవశాత్తు మరోసారి గాయంతో బాధపడ్డాడు. సర్ఫరాజ్ ఈ సీజన్‌లో ముంబై జట్టుకు అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఉన్నాడు. ఈ ప్లేయర్ మూడు ఇన్నింగ్స్‌లలో 220 పరుగులు చేశాడు, అలాగే మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ జట్టులో లేకపోవడం టీం బ్యాటింగ్‌ను చాలా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
