IND vs NZ 4th T20: విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ – డెవాన్ కాన్వే జంట న్యూజిలాండ్‌కు శుభారంభాన్ని అందించారు. న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో డారిల్ మిచెల్ 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు స్కోర్ 215 కి చేరుకుంది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2, బుమ్రా, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా టార్గెట్ 216 పరుగులు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇషాన్ ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మూడో టీ20లో ఇషాన్ కిషన్ గాయపడ్డాడని, దీంతో నాలుగవ టీ20 నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
భారత్ ప్లేయింగ్ XI
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI
టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, జాక్ ఫాల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
READ ALSO: jewellery: నగలను పింక్ పేపర్‌లోనే ఎందుకు చుడతారో తెలుసా?
