NTV Telugu Site icon

Match Fixing : మరోసారి వెలుగులోకి మ్యాచ్ ఫిక్సింగ్..

Match Fixing

Match Fixing

అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్ రాడార్ 2022వ సంవత్సరంలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్ ల వివరాలను వెల్లడించింది. ఈ నివేదికలో 13 క్రికెట్ మ్యాచుల్లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపించడం ఆసక్తి రేపుతుంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే స్పోర్ట్ రాడార్ కు చెందిన నిపుణులు రెగ్యులర్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి కార్యకలపాలపై తమ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించి 28 పేజీల ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది. 2022 ఏడాది క్యాలెండర్ లో మొత్తంగా 1212 మ్యాచ్ లపై వివిధ కోణాల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. ఇందులో 92 దేశాలకు చెందిన 12 ఆటలు ఉన్నాయి.

Also Read : Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..

అయితే అత్యధికంగా ఫుట్ బాల్ నుంచి 775 మ్యాచ్ లు అవినీతి లేదా ఫిక్సింగ్ రూపంలో జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత స్థానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఉంది. ఈ బాస్కెట్ బాల్ నుంచి 220 మ్యాచ్ లు ఉన్నాయి. ఆ తర్వాత 75 అనుమానాస్పద మ్యాచ్ లతో టెన్నిస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక క్రికెట్ లో 13 మ్యాచ్ లపై అనుమానాలు ఉన్నట్లు స్పోర్ట్ రాడార్ ఆరోస్థానం కేటాయించింది. క్రికెట్ లో 13 మ్యాచ్ లు ఫిక్సింగ్ లేదా అవినీతి జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇదే విషయమై పీటీఔ స్పోర్ట్ రాడార్ ను ఒక ప్రశ్న వేసింది. ఈ ఫిక్సింగ్ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ లేక 20 లీగ్ ల్లోనా అని పీటీఐ ప్రశ్నించింది.

Also Read : Kotamreddy Sridhar Reddy: సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా.. ఆ ముగ్గురి గురించి జగనే చెప్పాలి

దీనిక స్పార్ట్ రాడార్ స్పందిస్తూ ఫిక్సింగ్ గా అుమానిస్తున్న 13 మ్యాచ్ లు టీమిండియాకు కానీ, ఐపీఎల్ కు కానీ సంబంధం లేదని తెలిపింది. ఇదే స్పోర్ట్ రాడార్ సంస్థ 2020లో ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ యాంటీ కరప్షన్ యానిట్ లో పని చేసింది. బెట్టింగ్ లో జరుగుతన్న అక్రమాలపై తమ పరిశోధన చేసి బీసీసీకి నివేదిక అందించింది. దీంతో ఆ 13 మ్యాచ్ లు ఏవై ఉండొచ్చనే అనుమానాలను ఈ నివేదిక కలిగిస్తోంది.

Show comments