Site icon NTV Telugu

Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?

Temple Bell

Temple Bell

Temple Bell: మనమందరం ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటాం. హిందువులు దేవాలయాలకు వెళ్తే అక్కడ గంట కనిపిస్తుంది. చాలా మంది ముందుగా గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోరు. నిజానికి ఏ హిందూ దేవాలయంలోనైనా చిన్నదో, పెద్దదో గంట మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ గంటను భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు, ముఖ్యమైన పూజలు చేసినపుడు ఆలయ పూజారులు, భక్తులు కొడుతుంటారు. నిజానికి మీలో ఎంత మందికి ఈ గంట ఎందుకు కొడతారో అనే సందేహం వచ్చింది.. ఇంతకీ గంట కొట్టడం ద్వారా వచ్చే ప్రయోజనమేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Donald Trump: ఖమేనీ దిగిపోయే సమయం వచ్చింది.. ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్..

పలువురు పూజారులు, పండితుల అభిప్రాయం ప్రకారం.. దేవాలయంలో గంట కొట్టడం ద్వారా వచ్చే శబ్ధం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు, నెగిటివ్ వైబ్స్‌ను దూరం చేస్తుందని చెప్పారు. అంతే కాకుండా భగవంతుడి విగ్రహం ముందు భక్తులు గంట కొట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి సాక్షాత్తు ఆ దేవదేవుడికి చేరుతాయని చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారని వెల్లడించారు. అలాగే ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగడంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని వివరించారు. నిజానికి గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు. పురాణాల ప్రకారం.. గంట నాలుక భాగంలో సరస్వతి దేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని చెబుతున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి, ఆలయానికి వెళ్తే ముందుగా గంటను కొడతారు.

చాలా మందికి హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం ఉంటుంది. పలువురు పండితుల అభిప్రాయం ప్రకారం.. హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తున్నట్లు తెలియజేయడానికి గంటను కొడతారని చెప్పారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షగా దర్శించుకోవాలని పేర్కొన్నారు.

ఇప్పుడు సైన్స్ పరంగా చూస్తే.. గంటను తయారు చేసేటప్పుడు కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుతారు. గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేస్తుందని సైన్స్ చెబుతుంది. గంట కొట్టిన తర్వాత వచ్చే ఆ గంభీరమైన నాదం కనీసం 7 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ 7 సెకన్లు మన శరీరంలోని 7 హీలింగ్ సెంటర్లను (చక్రాలను) తాకుతుంది. దీనివల్ల మనసులోని ఆలోచనలన్నీ పోయి ఏకాగ్రత పెరుగుతుందని వివరిస్తుంది. ఆ శబ్దం వినగానే మన మెదడులోని ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయి, మనం పూర్తిగా దైవ దర్శనంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. అంటే మనల్ని మనం దేవుడికి అంకితం చేసుకోవడానికి ఇదొక సన్నాహం లాంటిది.

READ ALSO: Bobby Kolli – Chiranjeevi: ఈ నెలలోనే సెట్స్‌పైకి బాస్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!

Exit mobile version