Temple Bell: గుడిలో గంట కొట్టేది దేవుడి కోసం కాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temple Bell: మనమందరం ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటాం. హిందువులు దేవాలయాలకు వెళ్తే అక్కడ గంట కనిపిస్తుంది. చాలా మంది ముందుగా గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోరు. నిజానికి ఏ హిందూ దేవాలయంలోనైనా చిన్నదో, పెద్దదో గంట మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ గంటను భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు, ముఖ్యమైన పూజలు చేసినపుడు ఆలయ పూజారులు, భక్తులు కొడుతుంటారు. నిజానికి మీలో ఎంత మందికి ఈ గంట ఎందుకు కొడతారో అనే సందేహం వచ్చింది.. ఇంతకీ గంట కొట్టడం ద్వారా వచ్చే ప్రయోజనమేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Donald Trump: ఖమేనీ దిగిపోయే సమయం వచ్చింది.. ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పలువురు పూజారులు, పండితుల అభిప్రాయం ప్రకారం.. దేవాలయంలో గంట కొట్టడం ద్వారా వచ్చే శబ్ధం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులు, నెగిటివ్ వైబ్స్‌ను దూరం చేస్తుందని చెప్పారు. అంతే కాకుండా భగవంతుడి విగ్రహం ముందు భక్తులు గంట కొట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి సాక్షాత్తు ఆ దేవదేవుడికి చేరుతాయని చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారని వెల్లడించారు. అలాగే ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగడంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని వివరించారు. నిజానికి గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు. పురాణాల ప్రకారం.. గంట నాలుక భాగంలో సరస్వతి దేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని చెబుతున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి, ఆలయానికి వెళ్తే ముందుగా గంటను కొడతారు.
చాలా మందికి హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం ఉంటుంది. పలువురు పండితుల అభిప్రాయం ప్రకారం.. హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తున్నట్లు తెలియజేయడానికి గంటను కొడతారని చెప్పారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షగా దర్శించుకోవాలని పేర్కొన్నారు.
ఇప్పుడు సైన్స్ పరంగా చూస్తే.. గంటను తయారు చేసేటప్పుడు కాడ్మియం, సీసం, రాగి, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుతారు. గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేస్తుందని సైన్స్ చెబుతుంది. గంట కొట్టిన తర్వాత వచ్చే ఆ గంభీరమైన నాదం కనీసం 7 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ 7 సెకన్లు మన శరీరంలోని 7 హీలింగ్ సెంటర్లను (చక్రాలను) తాకుతుంది. దీనివల్ల మనసులోని ఆలోచనలన్నీ పోయి ఏకాగ్రత పెరుగుతుందని వివరిస్తుంది. ఆ శబ్దం వినగానే మన మెదడులోని ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయి, మనం పూర్తిగా దైవ దర్శనంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. అంటే మనల్ని మనం దేవుడికి అంకితం చేసుకోవడానికి ఇదొక సన్నాహం లాంటిది.
READ ALSO: Bobby Kolli – Chiranjeevi: ఈ నెలలోనే సెట్స్‌పైకి బాస్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే!
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!