Site icon NTV Telugu

Spicy Chicken: నీ శాడిజం తగలెయ్య.. చికెన్ సరిగ్గా చేయలేదని టెర్రస్ పై నుంచి భార్యని తోసేసిన భర్త..!

4

4

సంసారం జీవితంలో చిన్నపాటి గొడవలు కలతలు మామూలే. కాకపోతే అవి శృతి మించితేనే చెప్పలేని బాధలు ఎదురవుతాయి. మనిషికి మానవత్వం చాలా అవసరం. అదే లేకుంటే జంతువుకి మనకి తేడా ఉండదు. కాకపోతే ప్రస్తుత ప్రపంచంలో మానవత్వాన్ని చూపేవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరికొందరైతే సొంత వారిని కూడా ప్రేమగా చూడకుండా కఠినంగా ప్రవర్తించే రోజులువి. ఇంట్లో వారిని చిన్న చిన్న విషయాలకి హింసించి అత్యంత ఘోరంగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా భార్య భర్తలకు సంబంధించిన ఓ విషయం వైరల్ గా మారిన వీడియో చూసిన ప్రజలు భయాందోళనకు లోను అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Madhyapradesh : ఇంటిపై హైటెన్షన్ వైరు.. ఆపై సిలిండర్ పేలుడు.. ఐదుగురు సజీవదహనం

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో పాకిస్తాన్ కు చెందినది. ఈ వీడియోలో గమనించినట్లయితే.. ఓ మహిళ పై కప్పు నుండి కింద పడిపోయి అర్ధనాదాలు పెట్టడం గమనించవచ్చు. దాంతో చుట్టుపక్కల వారు ఆమెకు సహాయం చేయడానికి అక్కడికి చేరుకుని ఆ మహిళను లేపడానికి ప్రయత్నించారు. వీడియోలో ఉన్న మహిళ ఇంటి పైనుంచి కింద పడటంతో గాయం కారణంగా విపరీతమైన నొప్పితో అరవడం కూడా మనం గమనించవచ్చు. అయితే భార్య అలా ఇంటి మీద నుంచి పడిపోవడానికి కారణం భర్త.

Also read: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్

భార్య ఇంట్లో స్పైసీగా చికెన్ చేయలేదని ఆగ్రహించిన ఓ పాకిస్తానీ తన భార్యను ఎత్తుకొని టెర్రస్ పైనుంచి కిందకు పడేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ కేవలం ఇంట్లో వన్డే కూరలకే ఇలా హింసిస్తున్నాడంటే వేరే విషయాలకు ఎలా ఆ ఇల్లాలు ఇబ్బంది పడుతుందో మరి.

Exit mobile version