Site icon NTV Telugu

Flight Cancelled: సమాచారం లేకుండా విమానం రద్దు.. సిబ్బందితో సినీ నటుడి వాగ్వాదం..

Film Actor Pradeep

Film Actor Pradeep

Flight Cancelled: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు కావడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గురువారం రోజు రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు.. సమాచారం లేకుండా స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, హైదరాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానం.. తిరిగి రాత్రి 8.45 గంటలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతుంది.. కానీ, ఫ్లైట్ రద్దుపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేశారు.. సాయంత్రం నుండి వేచి ఉండటంతో అసహనంతో బైటాయించారు ప్రయాణికులు.. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఈ నిరసనలో ఎఫ్‌2 సినిమా నటుడు, సీనియర్ నటుడైన ప్రదీప్‌ కూడా పాల్గొన్నారు.. ఓ దశలో స్పైస్‌ జెట్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.. ఇక, శ్రీ ప్రయాణికుల నిరసన తరువాత స్పందించి.. ఆ తర్వాత ఏర్పాట్లు చేశారు అధికారులు…

Read Also: Joe Biden: మాజీ అమెరికా అధ్యక్షుడుకు ఏమైంది? తలపై ఆ గాయమేంటి?

Exit mobile version