NTV Telugu Site icon

lucky Bhaskar : దుల్కర్ “లక్కీ భాస్కర్” మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్..

Lucky Bhaskar

Lucky Bhaskar

lucky Bhaskar : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ “మహానటి”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఈ సినిమాలో జెమిని గణేశన్ గా దుల్కర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఆ తరువాత దుల్కర్ సల్మాన్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “సీతారామం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సినిమా ను చేస్తున్నాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.

Read Also :Kalki 2898 AD : కల్కి టీం పై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

దర్శకుడు వెంకీ అట్లూరి రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా “సార్” అనే సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ప్రేక్షలను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం ఈ దర్శకుడు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న “లక్కీ భాస్కర్ ” సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.అలాగే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని జూన్ 17న నుండి మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.