Site icon NTV Telugu

Rubyglow Pineapple : వామ్మో.. ఈ ఫైనాఫిల్ ఒకదాని ధర ఎన్ని వేలో తెలుసా?

Finee

Finee

సాదారణంగా ఫైనాఫిల్ ఒక దాని ధర మహా అయితే ఎంత ఉంటుంది.. వందో లేదా రెండు వందలు ఉండొచ్చు.. కానీ వేలు ఉండటం ఎప్పుడైనా విని ఉండరు.. కానీ పైన కనిపిస్తున్న ఫైనాఫీల్ ధర వేలల్లో ఉంటుందట.. అంత ఆ పండులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ ఈ ఫైనాఫిల్ ను అమ్ముతుంది.. ఎరుపు రంగులో ఉండే పై ​​తొక్క కారణంగా దీనికి రూబిగ్లో అని పేరు పెట్టారు.. ఈ పండు ఒకదాని ధర $395.99 మన కరెన్సీ లో రూ. 33073 వసూలు చేస్తున్నారు. ఈ పైనాపిల్‌ను సామాన్యులకు కాకుండా ప్రీమియం పండ్లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందిస్తున్నారు.. ఈ కాయలో ఉన్న ప్రత్యేకతలను కూడా ఒకసారి చూద్దాం..

ఈ పండు చూడటానికి ఎరుపు రంగులో ఉంటుంది.. ఇది ఎర్రటి తొక్క, గుజ్జు మామిడికాయలా పసుపు రంగులో ఉంటాయి. అమెరికాలోని ప్రముఖ ఆహార నిపుణుడిగా పరిగణించబడుతున్న డెల్ మోంటే ఈ పండును అభివృద్ధి చేయడానికి దాదాపు 15 పరిశోధనలు జరిపినట్లు తెలుస్తుంది..ఈ పండు చాలా ఖరీదైనది కావడంతో ధనవంతులు మాత్రమే దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ రకం పండ్లు ఈసారి 5 వేలు, వచ్చే ఏడాది 3 వేల పైనాపిళ్లు అమ్ముడవుతాయని అంచనా.. ఈ పండు ధర తో పాటుగా రుచితో పాటుగా పోషకాలు కూడా బాగా ఉండటంతో ఎక్కువగా దీన్ని కొనుగోలు చేస్తున్నారు..

Exit mobile version