Site icon NTV Telugu

Valentine’s Day 2024: ‘మిస్టర్‌ బచ్చన్‌’ నుంచి స్పెషల్ పోస్టర్.. రవితేజ గట్టిగానే పట్టుకున్నాడే..!

Mr Bachchan

Mr Bachchan

Special Poster Released from Ravi Teja’s Mr Bachchan Movie: ‘మాస్ మహారాజా’ రవితేజ హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్‌ వేగంతో దూసుకుపోతున్నారు. రవితేజ నటించిన ‘ఈగల్‌’ సినిమా తాజాగా విడుదలై థియేటర్లలో దూసుకుపోతుంది. ఈగల్‌ హిట్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. అదే ఊపులో తన తదుపరి సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. నేడు ‘వాలెంటైన్ డే’ సందర్భంగా ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read: Valentine’s Day 2024: వాలెంటైన్ డే స్పెషల్.. ఉపాసన స్పెషల్ ట్వీట్! అంతులేని ప్రేమ..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ వదిలారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్న రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ‘రవితేజ గట్టిగానే పట్టుకున్నాడే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌కు ‘నామ్ తో సునా హోగా’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారని, ఆయన కెరీర్‌లో ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ప్రత్యేకంగా అవుతుందని మేకర్స్‌ తెలిపారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీజె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version