Site icon NTV Telugu

TSRTC : వసంత పంచమి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

Tsrtc Discount

Tsrtc Discount

TSRTC : వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. బాసరకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ నుంచి 21, జేబీఎస్‌ నుంచి 12, నిజామాబాద్‌ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్‌ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసింది. వర్గల్‌కు సికింద్రాబాద్‌(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి 10, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నారు.

Read Also: INDvs NZ: రోహిత్, గిల్ దూకుడు..భారీ స్కోర్ దిశగా టీమిండియా

ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ లను ఉపయోగించుకుని భక్తులంతా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్‌కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతుందని వారు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్‌‎కు తమ అధికారిక వెబ్‌ సైట్‌ www.tsrtconline.in ను సందర్శించాలని కోరారు.

Read Also: Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక పరిణామం.. షాహిద్ అఫ్రిదిపై వేటు

Exit mobile version