NTV Telugu Site icon

TSRTC : ఉప్పల్‌లో SRH-MI మ్యాచ్‌.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Tsrtc

Tsrtc

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇవాళ (బుధవారం) జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు అంత సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య నేటి సాయంత్రం 7. 30 గంటలకు మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా, ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్‌ఆర్‌టీసీ ) దాదాపు 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. క్రికెట్ అభిమానుల కోసం ఈ ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మార్చి 27 మరియు ఏప్రిల్ 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు నడపబడతాయి. కోటి, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, కొండాపూర్‌, జేబీఎస్‌, ఎల్‌బీ నగర్‌, బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఆర్‌జీఐసీ స్టేడియం వరకు ఇవి నడపనున్నాయి.

స్టేడియంలో IPL మ్యాచ్ పూర్తయిన తర్వాత తిరిగి వచ్చే ట్రాఫిక్‌ను పిక్ చేసుకోవడానికి TSRTC బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ స్టేడియంలో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు కంట్రోలర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ బృందాలు అందుబాటులో ఉంటాయి. మార్చి 27 మ్యాచ్ కోసం : 9959226140/9959224058/ 99592226138.. ఏప్రిల్ 5 మ్యాచ్ కోసం 9959226419/ 9959226137/ 9959226147 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.